Bangladesh Protests:రిజర్వేషన్ల చిచ్చు, భగ్గుమన్న బంగ్లాదేశ్‌, విద్యార్థుల ఆందోళనలో 39 మంది మృతి,ఇంటర్నెట్ సర్వీసులకు బ్రేక్

సివిల్ సర్వీస్ పోస్టుల్లో స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు మూడో వంతు రిజర్వషన్లు ఇచ్చే కోటాను

Bangladesh protests(AFP)

Bangladesh, July 19:  రిజర్వేషన్ల చిచ్చుతో బంగ్లాదేశ్‌లో అగ్గిరాజుకుంది. సివిల్ సర్వీస్ పోస్టుల్లో స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు మూడో వంతు రిజర్వషన్లు ఇచ్చే కోటాను ఆ దేశ హైకోర్టు పునరుద్దరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై విద్యార్థి లోకం భగ్గుమంది. గత 18 రోజులుగా ఆందోళన బాట పట్టారు విద్యార్థులు.

ఇక విద్యార్థుల ఆందోళన ఉదృతంగా మారి హింసకు దారి తీసింది. దీంతో 39 మందికి పైగా మరణించగా వేల మంది గాయపడ్డారు. ఇక చనిపోయిన వారిలో విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు కాలేజీలు, యూనివర్సిటీలకు సెలవు ప్రకటించగా మరోవైపు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు రబ్బరు బుల్లెట్లు, వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. ఇక గురువారం ఒక్కరోజే 25 మంది చనిపోయారు.

రోడ్ల మీదికి వచ్చిన విద్యార్థులు కర్రలు, రాళ్లు, ఇతర మారణాయుధాలతో దాడులకు తెగబడుతుండగా భయానక వాతావరం నెలకొంది. ఇక బంగ్లాలో ఆందోళణ నేపథ్యంలో ఆ దేశానికి కొద్దిరోజుల పాటు వెళ్లవద్దని భారతదేశ అధికారులు సూచించారు.బ్రేకింగ్, మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్, సత్యనాదెళ్లకు ట్యాగ్ చేసిన యూజర్లు

బంగ్లాలో 16 నుండి అన్ని యూనివర్సిటీల్లో 4జీ నెట్‌ వర్క్‌ను నిలిపివేశారు. బంగ్లా ప్రధాని పిలుపు ఇచ్చిన తర్వాత కూడా విద్యార్థులు శాంతించలేదు. బీ టీవీ ఆఫీస్‌పై దాడిచేసి విధ్వంసం సృష్టించారు. కార్యాలయానికి నిప్పు అంటించడంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు.